
న్యూస్

మెగాస్టార్ చిరంజీవి 158 వ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర క్లైమాక్స్ సమయంలో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.
సినిమా సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. కుటుంబ భావోద్వేగాల ప్రధానంగా ఈ కథను బాబీ కొల్లి రూపొందించారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిల్ కపూర్ ఎంట్రీ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకురానుందని భావిస్తున్నారు.






.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)





.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!