

కృష్ణ లెగసీని కొనసాగిస్తూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. జయకృష్ణ ఘట్టమనేని, రమేశ్ బాబు తనయుడు, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మహేశ్ బాబు విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ హైప్ ఏర్పడింది. బాబాయ్ ఆశీర్వాదాలతో జయకృష్ణ గ్రాండ్‌గా పరిచయం అవుతున్నారు. తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. టీజర్లో ఆయన స్టైలిష్ లుక్, ఫిజిక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చివర్లో ఆయన ఎంట్రీ సీన్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. కొత్త హీరో, హీరోయిన్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్రెష్ ఫీల్ ఇవ్వనుండగా, ఘట్టమనేని వారసుడి డెబ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!