
న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తీవ్రమైన చలి కొనసాగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత దిగజారుతున్నాయి. నిన్న ఒక్కరోజే 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అలాగే ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మరో మూడు రోజులపాటు ఈ పరిస్థితి కొనసాగనుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.









.jpeg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!