

జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో ‘సేనాగళం’ పేరుతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జెన్‌జీ యువత అభిప్రాయాలు, ఆలోచనలకు వేదిక కల్పించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయ పార్టీగా జనసేన ముందుకు సాగేందుకు ‘సేనాగళం’ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కులం, మతం, వర్గాల పేరుతో వ్యక్తులపై దాడులు చేసే రాజకీయ ధోరణిపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని, వాటిని కులాలు లేదా మతాలతో ముడిపెట్టడం సమాజంలో విద్వేషాలకు దారి తీస్తుందని అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటూ, ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!