

జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ఈ డిమాండ్ నెరవేరడంతో రైల్వే పరిపాలన, రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించనున్నాయి.
కొత్త రైల్వే జోన్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా ఊతం లభించనుంది. రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!