
జనరల్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌ను ప్రబల శక్తిగా అభివర్ణించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో తమ దేశ చట్టబద్ధతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం ఇజ్రాయెల్ పట్ల బలమైన మద్దతు మరియు స్నేహపూర్వక వైఖరిని చూపుతోందని ఆయన పేర్కొన్నారు. జోర్డాన్ వ్యాలీలో జరిగిన ఒక నాయకత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ అంతర్జాతీయ దౌత్య సంబంధాల విస్తరణలో భారత్ ఒక ముఖ్యమైన ఉదాహరణ అని నెతన్యాహు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతమంది అభిమానులు తనకు భారత్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలు తమ దేశానికి ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!