
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖర్గేతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ఖర్గేకి వివరించారు.
ఇటీవల గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాల గురించి కూడా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపడుతున్న ఉద్యమాలు, సంస్థాగత బలోపేత చర్యల గురించి ఖర్గేకి సమగ్రంగా నివేదించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!