
జనరల్

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. ఇందులో ఒక విద్యుత్ బస్సుతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కోసం ఉపయోగించే 15 యాపిల్ ట్యాబ్‌లు ఉన్నాయి. ఈ విరాళాన్ని నీరా రాడియా అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు తాళం, ట్యాబ్‌లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
అనంతరం అధికారులు విద్యుత్ బస్సులో ప్రయాణించి దాని సామర్థ్యాన్ని పరిశీలించారు. టీటీడీలో మొత్తం 20 ధర్మరథం బస్సులు ఉండగా, వాటిలో 14 విద్యుత్ బస్సులేనని అధికారులు తెలిపారు. ఈ బస్సులు 21 స్టాప్‌లలో సుమారు 380 ట్రిప్పుల ద్వారా భక్తులకు సేవలందిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!