

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో విశేష ఆదరణ పొందుతూ భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా విజయోత్సాహంలో భాగంగా సూర్య తన చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకు సుమారు రూ.30 నుంచి రూ.40 లక్షల విలువైన మహీంద్ర బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని జీకే విష్ణు సోషల్ మీడియాలో పంచుకుంటూ సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దర్శకుడు ఆర్‌జే బాలాజీకి సూర్య ఎలాంటి ప్రత్యేక బహుమతి అందిస్తారోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!