

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్న ‘సితారే జమీన్ తే’ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్న రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పుకు దారి తీసింది. 8, 10, 12వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించే కార్యక్రమంలో అమృత్‌సర్‌కు చెందిన విద్యార్థిని, సమాన మార్కులు సాధించిన విద్యార్థులకు వయసు ఆధారంగా ఎందుకు వేర్వేరు ర్యాంకులు ఇస్తారని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు సభలో ఉన్నవారు చప్పట్లతో అభినందనలు తెలిపారు.
విద్యార్థిని ప్రశ్నకు స్పందించిన సీఎం భగవంత్ మాన్, సమాన మార్కులు సాధించిన విద్యార్థులందరూ తమ దృష్టిలో తొలి స్థానంలోనే ఉంటారని అన్నారు. వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి, సమాన మార్కులు సాధించిన విద్యార్థులకు సంయుక్తంగా మొదటి ర్యాంకు ఇవ్వాలని సూచించారు. వయసు ఆధారంగా కాకుండా ప్రతిభ, మార్కుల ఆధారంగానే ర్యాంకులు నిర్ణయించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా విద్యార్థిని ధైర్యాన్ని ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!