
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు అభినందనలు తెలిపారు. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తూ మరోసారి దేశ ఖ్యాతిని పెంచినందుకు వారిని కొనియాడారు.
సాత్విక్, చిరాగ్‌ల విజయం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని జగన్ పేర్కొన్నారు. కఠోర శ్రమ, అంకితభావంతో సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఇద్దరు మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!