
గాసిప్స్

నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించిన ఆయన, ప్లాంట్ ఏర్పాటు ఖర్చులు, నిర్వహణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, యూనిట్ విక్రయ ఛార్జీలపై కూడా వివరాలు సేకరించారు.
కాకినాడలోని జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని ఆయన ప్రశ్నించగా, నవంబర్ నాటికి ప్రారంభిస్తామని ప్రతినిధులు తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ కోరారు. ఏడాదికి నాలుగు సార్లు PCB నివేదికలు ఇస్తున్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!