

వారణాసిలోని పాఠశాలలు, కళాశాలల్లో తమిళ భాషా తరగతులను ప్రవేశపెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సాంస్కృతిక, భాషా సమైక్యతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘కాశీ–తమిళ్ సంగమం’ విజన్‌కు అనుగుణంగా అమలు కానుంది.
ఈ క్రమంలో ప్రభుత్వ క్వీన్స్ కళాశాలలో ప్రతిరోజూ సాయంత్రం తమిళ భాషా తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ తరగతులు నిర్వహించాలని జిల్లా పాఠశాలల ఇన్స్పెక్టర్ ఆదేశించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు.
అదేవిధంగా, వారణాసి నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులను తమిళనాడుకు పంపి హిందీ బోధించే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య భాషా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!