

జుక్కల్‌లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ గొడవల్లో తరచూ మధ్యవర్తిత్వానికి వస్తున్నాడనే ఆగ్రహంతో కరంజీ గోపాల్ అనే వ్యక్తి తన పొరుగువాడిపై గొడ్డలితో దాడి చేశాడు. గోపాల్ తన భార్యతో తరచూ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మరోసారి ఘర్షణకు దిగిన అతడు, గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో భయపడిన భార్య, పిల్లలు ఇంటి నుంచి పారిపోయారు.
తమ కుటుంబ గొడవల్లో ఎప్పుడూ జోక్యం చేసుకుంటున్నాడని, తన భార్యా పిల్లలను ఎక్కడికో పంపించాడని కోపంతో గోపాల్ ఎదురింటి దత్తుపై దాడి చేశాడు. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతని మెడపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గోపాల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి జుక్కల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడి కాలికి గొలుసు కట్టి తాళం వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం భద్రతా కారణాల వల్లే ఇలా చేశామని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!