
క్రీడలు

తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కడప జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి అనే బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు. రామిరెడ్డిపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అతడు మృతి చెందిన ఘటన విద్యార్థుల్లో, స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల అదే విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!