

నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ తన భార్య సంగీతతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఈ రోజు విచారణకు రానుండగా, శనివారం చెన్నైలో ఇరు వర్గాల న్యాయవాదుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
పరస్పర విడాకుల నేపథ్యంలో ఆస్తి సెటిల్‌మెంట్‌పై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. విజయ్ ఆస్తి వివరాల ఆధారంగా సంగీత రూ.250 కోట్ల సెటిల్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే కుమారుడు, కుమార్తెకు కూడా వేర్వేరు సెటిల్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. సంగీతకు రూ.35 కోట్ల సెటిల్‌మెంట్‌కు విజయ్ అంగీకరించినట్లు, పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని తెలిపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సంగీత చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ నివాసంలో కేసు ముగిసే వరకు ఉండేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో పాటు విడాకుల కేసు కూడా చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఈ రోజు విచారణకు రానుంది. ఎన్నికల ప్రచారం కారణంగా ప్రత్యక్షంగా హాజరు కాలేనని, ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని విజయ్ తరఫున ఈనెల 17న పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!