
సినిమాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు, ఆయన జీవిత విశేషాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ‘ధర్మచక్రం’ సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రదర్శించనున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ తెలిపారు.
నిన్న విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి నిస్వార్థంగా అందిస్తున్న సేవలను ఈ చిత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజలంతా ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలని కోరారు. కార్యక్రమంలో కొండిశెట్టి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!