
సినిమాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని, గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీవారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షల విరాళాన్ని అందించారు. ఈ విరాళం ద్వారా భక్తులకు అన్నప్రసాద సేవ నిర్వహించనున్నారు.
నిన్న సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, దాత విరాళ డీడీని టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇటువంటి దాతృత్వం మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!