
న్యూస్

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన కలిగించింది. నిన్న ఉదయం శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత, శ్రీవారిమెట్టు మార్గాన్ని దాటి సమీపంలోని సరస్వతీ మండపం వద్ద సంచరిస్తూ కనిపించింది. కాలినడకన వెళ్తున్న భక్తులు దీనిని గుర్తించి వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది, చిరుత ఒక చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్నట్లు గుర్తించారు. వారు పెద్దగా శబ్దం చేయడంతో చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం విజిలెన్స్ సిబ్బంది భక్తులు, పాదచారులను అప్రమత్తం చేస్తూ గుంపులుగా ప్రయాణించాలని సూచించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!