

ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2027 ఈ ఏడాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే పూర్తిచేసి, రైతులు మరియు భూ యజమానులకు రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, భవిష్యత్తులో ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో ఈ పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు, భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకమని అన్నారు. భూమి–నీరు–సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వివాదాల లేని భూములు, ప్రతి ఎకరాకు నీరు, లాభదాయకమైన సాగును లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత పాలకుల తప్పుడు విధానాల వల్ల భూ రికార్డులు తారుమారయ్యాయని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా శుద్ధి చేసి రైతులకు నిజమైన భద్రత కల్పిస్తామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!