
సినిమాలు

తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ మొదటి మూడు సినిమాలు 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' లతో సెన్సేషనల్ హిట్లు సాధించాడు. కానీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మిక్స్డ్ రివ్యూస్‌తో ప్లాప్ అయ్యింది. ఇది ఆయన హిట్ స్ట్రీక్‌కు అడ్డుకుంది. ఆసక్తికరం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ మొదట శివకార్తికేయన్ కోసం ప్లాన్ అయింది.
2019లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో అనౌన్స్ అయి, 2020లో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. వరుస వాయిదాలు పడుతూ, ఆరేళ్ల తర్వాత ప్రదీప్ హీరోగా వచ్చి మిక్స్డ్ ఫలితం సాధించింది. సై-ఫై రొమ్ కామ్ జానర్లో కాన్సెప్ట్ బాగున్నా, సెకండ్ హాఫ్ డ్రాగ్ అయ్యింది. ఫస్ట్ ప్లాప్ దెబ్బ తిన్న ప్రదీప్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఇప్పుడు దృష్టి పడింది. మరి అతని తదుపరి సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!