
క్రీడలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 180 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరూన్ గ్రీన్ 79 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, రోవ్‌మన్ పావెల్ 27 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ 3 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన 86 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు నిలకడగా ఆడిన గుజరాత్ జట్టు లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించి ఘనవిజయం నమోదు చేసింది.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!