

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాను మొదట ఈ నెల 30న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం కష్టమని సమాచారం వస్తోంది. దీంతో కొత్త విడుదల తేదీపై చిత్ర బృందం ఆలోచిస్తోంది.
ఈ నెల తేదీ మిస్ అయితే జూన్ 4ను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే తేదీకి యష్ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అది వాయిదా పడే అవకాశముంది. అలా అయితే ఆ తేదీని ‘పెద్ది’ కోసం ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, పాటలు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కనిపించనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంగీతాన్ని ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!