

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘తలైవర్ 173’ చిత్రం కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, తరువాత ఆయన తప్పుకోవడంతో సిబి చక్రవర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మరింత కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ప్రస్తుతం సిబి చక్రవర్తి కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. కథలో కొన్ని మార్పుల విషయంలో రజనీకాంత్, దర్శకుడి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఒక వాదన. మరోవైపు ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అలాగే సిబి చక్రవర్తి గతంలో ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని, ఆ నిర్మాత ఈ సినిమాలో భాగస్వామ్యం కోరగా కమల్ హాసన్ సంస్థ అంగీకరించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో సిబి చక్రవర్తి స్థానంలో అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మొత్తానికి ఇంత పెద్ద సినిమా విషయంలో ఎందుకింత గందరగోళం ఏర్పడిందనే చర్చ కొనసాగుతోంది.



















.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!