
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమ్మెతంగా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్శనలో సీఎం మనవడికి అక్షర అబ్యాసం చేయించి విద్యారంభం చేశారు.
అలాగే, బాసర ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేంద్ర రెడ్డి, నాగేష్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వేడ్మ బొజ్జు, రామారావు పటేల్, ఎంఎల్సీలు దండే విఠల్, అంజి రెడ్డి, దేవాదాయా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!