
న్యూస్

సినీ నటుడు విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రానికి మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే రాజకీయ, సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సినిమాకు ఇప్పుడు లీక్ సమస్య తలెత్తింది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాటతో పాటు సుమారు 5 నిమిషాల వీడియో ఆన్లైన్లో బయటకు రావడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ క్లిప్స్ వైరల్గా మారడంతో వెంటనే స్పందించిన టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే సీబీఎఫ్సీ సర్టిఫికెట్ రాకపోవడం, కోర్టు కేసులు వంటి కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో లీక్ ఘటన సినిమా విడుదలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!