
టెక్నాలజీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబానికి మొత్తం రూ.8.99 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, తన వ్యక్తిగత ఆస్తుల విషయానికి వస్తే, చరాస్తులు రూ.50.86 లక్షలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరుమీద ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి వంటి ఎలాంటి స్థిరాస్తులు లేవని అఫిడవిట్లో స్పష్టం చేశారు.
అదేవిధంగా తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి వాహనాలు లేవని కూడా వెల్లడించారు. తన భార్య రాధ పేరుమీద స్థిర, చరాస్తులు కలిపి రూ.5.61 కోట్లు ఉన్నట్లు, అలాగే ఉమ్మడి కుటుంబం పేరుమీద మరో రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఈ వివరాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!