

లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అసంతృప్తిగా ఉంది. ప్రత్యర్థి ఆటగాడు అవేష్ ఖాన్ ప్రవర్తనపై బీసీసీఐకి ఫిర్యాదు చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల అంపైర్ల నిర్ణయాలపై కూడా వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్లో అయిదో బంతిని లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ లాంగాఫ్ వైపు కొట్టాడు. బంతి బౌండరీకి వెళ్లేలోపే డగౌట్ దగ్గర ఉన్న అవేష్ ఖాన్ తన చేతిలోని బ్యాట్‌తో బంతిని మైదానంలోకి కొట్టాడు. అప్పటికి బంతి ఇంకా ఆటలోనే ఉందని, తమకు పెనాల్టీ పరుగులు ఇవ్వాలని సన్‌రైజర్స్ వాదిస్తోంది. కానీ అక్కడ ఫీల్డర్ లేకపోవడంతో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చలేదు.
ఇంతకుముందు బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఔట్ విషయంలో, కోల్‌కతాతో మ్యాచ్‌లో అభిషేక్ ఔట్ విషయంలో కూడా సన్‌రైజర్స్ సందేహాలు వ్యక్తం చేసింది. ఫలితాల్లో మార్పు ఉండకపోయినా, ఇలాంటి నిర్ణయాలు పదే పదే రావడంతో ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని జట్టు నిర్ణయించింది.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!