

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి కేసు నమోదు అయింది. గుంటూరు నగరంలో కలెక్టరేట్ ఎదుట ఆయన చేపట్టిన నిరాహార దీక్ష ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని పోలీసులు తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శనివారం దీక్ష చేపట్టారు.
అయితే ముందస్తు అనుమతి లేకుండా ప్రజా ప్రదేశంలో దీక్ష నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. దీక్ష కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలు దెబ్బతిన్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలిగాయని తెలిపారు. ఈ కారణాలతోనే నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇటీవల తన నివాసంపై జరిగిన దాడి అంశంపై అంబటి రాంబాబు ఈ నిరసన చేపట్టగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కూడా కొన్ని కేసుల్లో అరెస్ట్ అయి రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ కొత్త కేసుపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!