

మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 అప్‌డేట్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అప్‌డేట్స్ పెండింగ్‌లో ఉంటే యూజర్లు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకున్న మైక్రోసాఫ్ట్, యూజర్లకు మరింత సౌకర్యాన్ని కల్పించేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై 35 రోజుల పరిమితిని దాటి అప్‌డేట్స్‌ను వాయిదా వేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి 35 రోజులకు ఒకసారి పొడిగించుకుంటూ అవసరమైనంతకాలం అప్‌డేట్‌ను పోస్ట్‌పోన్ చేయవచ్చు. అలాగే, క్యాలెండర్‌లో నిర్దిష్ట తేదీని ఎంచుకుని అప్‌డేట్‌ను షెడ్యూల్ చేసుకునే సదుపాయం కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా, అప్‌డేట్‌తో సంబంధం లేకుండా రీస్టార్ట్ లేదా షట్‌డౌన్ చేసుకునే అవకాశం కల్పించడం యూజర్లకు పెద్ద ఉపశమనం. ప్రస్తుతం ఈ ఫీచర్ విండోస్ ఇన్‌సైడర్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!