
క్రీడలు

ఎయిర్ ఇండియా తీసుకున్న కొత్త డ్రెస్ కోడ్ మార్గదర్శకాలు వివాదానికి దారితీశాయి. క్యాబిన్ సిబ్బంది సింధూరం, మంగళసూత్రం వంటి మతపరమైన గుర్తులను ధరించకూడదని సంస్థ జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.
సిబ్బంది నుదుట తిలకం, చేతికి పెళ్లి గాజులు, మత సంబంధిత నల్లదారాలు, పూసలు, మెడలో తాళి, గొలుసులు, హారాలు ధరించరాదని హ్యాండ్బుక్‌లో పేర్కొనబడింది. అలాగే ముక్కుపుడకలు, కాలు మట్టెలు, పట్టీలు వంటి అలంకరణలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఇదే తరహా మార్గదర్శకాలతో లెన్స్కార్ట్ సంస్థ కూడా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్ ఇండియా నిర్ణయం కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!