

భారత ఎన్నికల సంఘం తెలిపిన ప్రకారం పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులో భారీ ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బెంగాల్లో 78.77 శాతం, తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కువ ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
బెంగాల్లో దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో అత్యధికంగా 81.49 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత పశ్చిమ మేదినీపూర్ 81.07 శాతం, ఝార్గ్రామ్ 81.04 శాతం, బీర్భూమ్ 80.22 శాతం నమోదయ్యాయి. ముర్షిదాబాద్, డార్జిలింగ్, మాల్దా జిల్లాల్లో కూడా మంచి ఓటింగ్ నమోదైంది.
తమిళనాడులో నామక్కల్ 76.43 శాతంతో ముందంజలో నిలిచింది. కరూర్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ జిల్లాల్లో కూడా 75 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ధర్మపురి, దిండిగల్, కాంచీపురం, కోయంబత్తూరు, కల్లకురిచి, తిరుచిరాపల్లి వంటి జిల్లాల్లో కూడా మంచి ఓటింగ్ శాతం కనిపించింది. ఇది ప్రజలలో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని చూపిస్తోంది.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!