
ఆరోగ్యం
.webp&w=3840&q=75)
హైదరాబాద్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మార్చినట్లు తెలిపారు. ఇకపై బస్సులు అక్కడే ఆగనున్నాయి.
బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లేఅవుట్ మార్గం ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ–నాచారం–చెంగిచర్ల మార్గం ద్వారా జాతీయ రహదారికి చేరుకోవాలని సూచించారు. చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుకనున్న మార్గాన్ని ఉపయోగించాలని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.







.webp&w=3840&q=75)





.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!