

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు శోభాయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ సూచనలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, ధూల్‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, కోఠి వంటి ప్రధాన మార్గాల గుండా ప్రయాణించనుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మల్లేపల్లి ఎక్స్ రోడ్స్, అఘాపురా ఎక్స్ రోడ్స్, భోయిగూడ కమాన్, గాంధీ స్టాచ్యూ, తక్కర్వాడి జంక్షన్, బేగం బజార్ చత్రి, అఫ్జల్‌గంజ్ టీ-జంక్షన్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, చాదర్‌ఘాట్, కాచిగూడ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అవసరానికి అనుగుణంగా మళ్లిస్తారు. యాత్ర వెళ్లిన వెంటనే ట్రాఫిక్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తామని పోలీసులు తెలిపారు.
అయితే బేగం బజార్, ఎస్.ఏ. బజార్, అఫ్జల్‌గంజ్, శివాజీ బ్రిడ్జ్, సీబీఎస్, రంగ్‌మహల్ జంక్షన్, పుత్లీబౌలి, కోఠి, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ, నింబోలిఅడ్డ వంటి ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించవచ్చని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.















%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!