

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ ఈ నెల 19 న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.500 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు స్టార్‌లు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు.
అయితే బాలీవుడ్ నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి కొద్దిమంది మాత్రమే స్పందించారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ భార్య అయిన దీపికా పదుకొనె మౌనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా సక్సెస్‌పై ఆమె ఒక్క పోస్టు కూడా చేయకపోవడం, సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించకపోవడం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఈ పరిణామాలతో రణవీర్ – దీపిక మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. రణవీర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటుండగా, దీపిక ముంబైలో తన కుటుంబంతో కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కనిపించింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే రణవీర్ అభిమానులు మాత్రం అలాంటిదేమీ లేదని, దీపిక తన ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల స్పందించలేదని చెబుతున్నారు. ఈ పుకార్లకు పూర్తి క్లారిటీ రావాలంటే దీపిక స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.






.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!