
సినిమాలు

దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను పుంజుకునేలా చేశాయి. ఈ సానుకూల ప్రభావంతో భారత మార్కెట్లు కూడా బుధవారం ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో BSE Sensex 934.2 పాయింట్లు ఎగబాకి 75,002 వద్ద ఉండగా, NSE Nifty 50 305.6 పాయింట్ల లాభంతో 23,218 వద్ద కొనసాగుతోంది. అయితే, రూపాయి విలువ 20 పైసలు తగ్గి 93.96 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీ రంగం మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!