

మైథలాజికల్ సూపర్ హీరో సినిమా హనుమాన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'జై హనుమాన్' టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హంపీలోని అంజనాద్రిలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ సీక్వెల్లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆయన పారితోషికం డీల్ గురించి చర్చ జరుగుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రూ.20 కోట్ల పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 33 శాతం వాటా. రెండోది సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రూ.80 కోట్ల ఫిక్స్డ్ పారితోషికం.
సాధారణంగా స్టార్ హీరోలు ఫిక్స్డ్ పారితోషికాన్ని ఎంచుకుంటారు. కానీ రిషబ్ శెట్టి మాత్రం లాభాల్లో వాటా తీసుకునే ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఫిలింనగర్ టాక్. సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కీలకమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. అలాగే రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని వంటి నటులు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించే అవకాశం ఉంది.


.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!