
జనరల్

ప్రముఖ యువ కథానాయకుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నటన పట్ల అంకితభావంతో ప్రతి చిత్రాన్ని ఎంతో తపనతో చేసే నటుడిగా రామ్ చరణ్‌ను ఆయన అభివర్ణించారు.
కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తూ, పెద్దల పట్ల గౌరవం చూపుతూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రామ్ చరణ్‌లో ఆధ్యాత్మిక చింతన కూడా మెండుగా ఉందని, ఇవే ఆయనకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తాయని అన్నారు.
రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, సంపూర్ణ ఆనందంతో ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!