

నటి రష్మిక తన పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయిన సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. నటుడు విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఫోటోలు పంచుకుని, కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో నమ్మలేకపోతున్నానని తెలిపింది.
పెళ్లి అనేది ఒకప్పుడు చాలా దూరంగా ఉన్న కలలా అనిపించేదని, ఇప్పుడు అది నిజమైందని రష్మిక పేర్కొంది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపింది. వారు లేకపోతే తన పెళ్లి ఇంత అందంగా జరిగేది కాదని చెప్పింది.
ఐశ్వర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను ప్రస్తావిస్తూ వారి ప్రేమ, సహకారాన్ని కొనియాడింది. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని వారు చెప్పారని, తాను కూడా అలాగే చేశానని తెలిపింది. వారిని తన చిన్న ప్రపంచంగా పేర్కొంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.











.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!