

దావోస్ పర్యటనల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రానికి మొత్తం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ పర్యటనల్లో ప్రభుత్వం 44 ఎంవోయూలు కుదుర్చుకుందని, వాటి ద్వారా 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. 2024లో 18 ఎంవోయూలతో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2025లో 26 ఎంవోయూల ద్వారా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు.
అలాగే రూ.81,800 కోట్ల పెట్టుబడులతో ఆరు కంపెనీలకు భూములు కేటాయించగా, ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. మరో మూడు కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూములు గుర్తించారని తెలిపారు. నిజామాబాద్ ఐటీ టవర్లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, 681 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ టవర్లో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!