

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రంగా ఉండనున్నట్లు India Meteorological Department హెచ్చరించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని పేర్కొన్నారు.
ఈ నెలలో ఇది రెండో పీక్ కోల్డ్ వేవ్ గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చలి ప్రభావం కేవలం రెండు రోజులకే పరిమితం కాకుండా, వచ్చే వారం వరకూ కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!