

భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ప్రస్తుతం రోజుకు 1500 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుండగా, వాటిలో 500 టికెట్లను మూడు నెలల ముందస్తు బుకింగ్ కింద విడుదల చేయనుంది. అలాగే తిరుపతి విమానాశ్రయంలో 200 టికెట్లను కరెంట్ బుకింగ్ కింద జారీ చేయనుంది.
మిగిలిన 800 కరెంట్ బుకింగ్ కోటాలో, ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనానికి ఎదురుచూస్తున్న దాతలకు రోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించనుంది. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి వర్తించనుండగా, టికెట్లు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు విడుదల అవుతాయి. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించనున్నారు. ఈ విధానం జూన్ 10 నుంచి అమలులోకి వచ్చి 2027 మార్చి 31 వరకు కొనసాగుతుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!