
ఆరోగ్యం

ప్రపంచ స్థాయి టీ ర్యాంకింగ్స్‌లో భారతదేశ టీలు విశేష గుర్తింపు పొందాయి. ఇందులో మన దేశానికి చెందిన మసాలా చాయ్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాన్ని సాధించింది. ఈ జాబితా భారత టీ సంస్కృతి, రుచుల వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
మసాలా చాయ్‌తో పాటు ఇతర ప్రాంతీయ టీలు కూడా ర్యాంకింగ్స్‌లో స్థానం దక్కించుకున్నాయి. డార్జిలింగ్ టీ 6వ స్థానంలో, అస్సాం చాయ్ 13వ స్థానంలో నిలిచాయి. కర్ణాటకకు చెందిన సులేమాని చాయ్ 39వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా టీ 41వ స్థానంలో, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక నూన్ చాయ్ 43వ స్థానంలో నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!