
ఆరోగ్యం

దేవాలయాల్లో కొనసాగుతున్న వీఐపీ దర్శనాల సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దేవుడి ముందు అందరూ సమానమేనని, దేవాలయాల్లో ప్రత్యేక వర్గాలు ఉండవని స్పష్టం చేసింది. పదవి లేదా హోదా ఆధారంగా దర్శనాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
“ఈ సృష్టిలో దేవుడొక్కడే నిజమైన వీఐపీ, ఆయన ఎవరి కోసమూ వేచి ఉండరు” అంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి ప్రవేశించడం సరికాదని పేర్కొంది. ఈ విధానం సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!