
ఆరోగ్యం

దేశంలో పెరుగుతున్న వరకట్న హత్యలు, వేధింపుల ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వధువు, ఆమె కుటుంబ సభ్యులను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. వివాహం అనంతరం మహిళలు, వారి కుటుంబాలు అనేక రకాల మానసిక, సామాజిక వేధింపులు ఎదుర్కొంటున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
చదువుకున్న, ఆర్థికంగా బలమైన కుటుంబాల్లో కూడా వరకట్న వేధింపులు పెరుగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వధువు కుటుంబాలను తక్కువ చేసి మాట్లాడటం, అవమానించడం వంటి చర్యలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం విచారకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వరకట్న వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మహిళలకు గౌరవం, భద్రత కల్పించే దిశగా సమాజం ముందుకు రావాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!