
గాసిప్స్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగం కోల్పోయారు. వ్యయభారం తగ్గించుకునేందుకు చేపట్టిన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా వాషింగ్టన్ పోస్ట్ సంస్థ లేఆఫ్స్ ప్రకటించగా, అందులో ఇషాన్ కూడా ఉన్నారు. ఈ ప్రక్రియలో సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని తొలగించినట్లు సమాచారం. ఇషాన్ థరూర్ వాషింగ్టన్ పోస్ట్‌లో సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమిస్ట్‌గా పనిచేశారు.
లేఆఫ్స్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, గత 12 ఏళ్లుగా వాషింగ్టన్ పోస్ట్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనేక ప్రతిభావంతమైన సహచరులతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతో విలువైనదని, ఈ పరిణామం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల విభాగానికి చెందిన పలువురు సిబ్బంది కూడా ఈ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!