
క్రీడలు

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనల కఠినతరం, ఫీజుల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో విద్యా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల ప్రభావం తల్లిదండ్రులపై కూడా తీవ్రంగా పడుతోంది. ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అదనపు భారం పడుతున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికాకు కొత్తగా వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా స్లాట్లు పొందడం కూడా కష్టంగా మారింది. వీసా ఫీజుల పెంపు, కఠిన పరిశీలన ప్రక్రియలు విదేశీ విద్యపై ఆసక్తి ఉన్నవారికి మరిన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!