
క్రీడలు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశం విద్యార్థులు, వారి కుటుంబాలకు తీరని వేదన కలిగించిందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తూ, యూపీఎస్సీ విధానాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి సూచించింది.
జవాబుదారీతనం లేకుండా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టనున్న సంస్కరణలపై సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు అవసరమని ధర్మాసనం పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!