

ఇరాన్‌లో నాయకత్వం విభేదాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. దేశ రాజకీయ నాయకత్వం, సైనిక వ్యవస్థ మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఒక వైపు, రాజకీయ నాయకత్వం మరో వైపు అధికారంపై ప్రభావం కోసం పోటీ పడుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నేతలు కలిసి సుప్రీం నేత మొజ్తాబాకు రాసిన రహస్య లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ లేఖపై పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్, అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి సీనియర్ నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని నేతలు లేఖలో సూచించారు. దేశం ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు అవసరమని హెచ్చరించారు. ప్రస్తుత విధానాలు కొనసాగితే దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే పాలనలో సైన్యం జోక్యం అధికమైందని, ఎన్నికైన ప్రతినిధుల నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా లేఖలో కోరారు. విదేశాంగ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచిస్తూ, నాయకత్వం తన వ్యూహాలను పునర్విమర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!