
రాజకీయాలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం పీఆర్సీతో పాటు ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టీసీ మన కుటుంబమని, దీర్ఘకాల సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. విలీన ప్రక్రియ కోసం అధికారులతో, కార్మిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో ఆర్టీసీ ప్రజా రవాణాలో అగ్రగామిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.








.jpg&w=3840&q=75)



.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!